మోదీ-చంద్రబాబుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది: జైరాం రమేష్

  • 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది
  • ఏపీకి ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి?
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ, చంద్రబాబులు డ్రామాలాడుతున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులపై ఆయన విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ కలసి పార్లమెంటులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నప్పుడు... ఏపీకి ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఏపీకి మోదీ, చంద్రబాబులతో ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇద్దరూ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. 
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
jairam ramesh

More Telugu News